జయకృష్ణకు ఘన స్వాగతం

Jun 27,2024 21:33

 ప్రజాశక్తి – పాలకొండ : స్థానిక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి సారిగా పాలకొండలో అడుగు పెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే జయకృష్ణకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో అడుగడుగునా గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంగళహారతిలు, పూలదండలతో జయకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయోత్సవ ర్యాలీలో సందడి చేశారు. ఓ పక్క వర్షం కురుస్తుండగా, మరో పక్క విజయోత్సవ ర్యాలీ కోటదుర్గమ్మ ఆలయం నుండి యాలాం జంక్షన్‌ వరకు ఘనంగా సాగింది. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కర్నేని అప్పలనాయుడు, తేజోవతి, ఇమరిక ప్రసాద్‌, గాడ శ్రీధర్‌, కోటేశ్వరరావు, గంటా సంతోష్‌, తదితరులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే జయకృష్ణపై పూల వర్షంవీరఘట్టం: జనసేన పాలకొండ ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసి గురువారం తొలిసారి వీరఘట్టానికి వచ్చిన నిమ్మక జయకృష్ణపై నాయకులు, కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. పార్వతిపురం మీదుగా వీరఘట్టం మండలంలోని కడకల్లా, నడిమికల్లా, విక్రంపురం, నడుకూరు, చిట్టిపూడివలస, వీర ఘట్టం, రేగులపాడు, తూడి, బొడ్లపాడు, పాపంపేట, వండువ గ్రామ జంక్షన్‌ వద్ద కార్యకర్తల అభిమానులు రోడ్డుపైకి వచ్చి పూలదండలు వేసి పువ్వులు చల్లి అభిమానం చాటుకున్నారు.

➡️