ఆడుదాం ఆంధ్ర లోగో ఆవిష్కరణ

Dec 1,2023 21:52

సీతంపేట : ఆడుదాం ఆంధ్ర లోగోను ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈనెల 15 నుంచి సచివాలయ, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైందని, కావున యువత అందరూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిఎస్‌డిఒ ఎస్‌.వెంకటేశ్వరరావు, ఐటిడిఎ స్పోర్ట్స్‌ ఇన్‌ఛార్జ్‌ జాకబ్‌ దయానందం, పీడీ, పిఇటిలు గాంధీ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

➡️