ఓటు అడిగే హక్కు మాకే ఉంది

Mar 23,2024 20:40

సాలూరు: రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికే టిడిపి, జనసేన బిజెపితో పొత్తు పెట్టుకున్నాయని డిప్యూటీ సిఎం రాజన్నదొర విమర్శించారు. మండలంలోని శివరాంపురంలో ఎన్నికల ప్రచారానికి శనివారం ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత గ్రామంలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్‌ జర్జాపు మోహన్‌, వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌, గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ రెడ్డి పద్మావతి ఆధ్వర్యాన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి మళ్లీ వైసిపిని గెలిపించాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎపిలో ఓటు అడిగే హక్కు వైసిపి కే వుందన్నారు. కుల,మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ, అభివద్ధి పథకాలను అమలు చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని చెప్పారు. 2014 నుంచి 2019 సమయంలో టిడిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏవీ లేవన్నారు. నియోజకవర్గంలో టిడిపి నాయకులు ఏం అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని అనేక సార్లు తాను సవాల్‌ చేసినా స్పందించలేదని చెప్పారు. తాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశానో చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. నియోజకవర్గంలో పేదలకు రూ.1600 కోట్ల మేర సంక్షేమ లబ్ది అందించినట్లు తెలిపారు. రూ.1200 కోట్లు మేర రహదారులు, వంతెనలు, భవనాల నిర్మాణానికి ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇంతటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రభుత్వాన్ని వద్దనుకుంటే ప్రజలే నష్టపోతారని చెప్పారు. అధికారం కోసం టిడిపి నాయకులు అడ్డదారులు తొక్కు తున్నారని విమర్శించారు.ఇలాంటి పార్టీలను గెలిపిస్తే ప్రజలే నష్టపోతారని అన్నారు. ఐదోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే శివరాంపురంలో అసంపూర్తి వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. తన హయాంలోనే గ్రామాభివృద్ధి జరిగిందని రాజన్నదొర చెప్పారు. కార్యక్రమంలో మండల జెసిఎస్‌ కన్వీనర్‌ కె. త్రినాధ్‌నాయుడు, సీనియర్‌ నాయకులు దండి శ్రీనివాసరావు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, అర్బన్‌ బ్యాంక్‌ అధ్యక్షులు జర్జాపు ఈశ్వరరావు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, పట్టణ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, సీనియర్‌ నాయకులు డోల బాబ్జీ, మావుడి రంగు నాయుడు, మెంటాడ మండల నాయకులు ఈశ్వరరావు పాల్గొన్నారు.గుమడాంలో ప్రచారం ఎన్నికల ప్రచారం లో భాగంగా శనివారం డిప్యూటీ సీఎం రాజన్నదొర పట్టణం లోని గుమడాంలో కూడా పర్యటించారు .గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి వైసిపికి ఓటు వేయాలని కోరారు. మళ్లీ గెలిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఆయన వెంట వైసిపి సీనియర్‌ నాయకులు జర్జాపు సూరిబాబు, ఈశ్వరరావు, పట్టణ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, వైస్‌ చైర్మన్‌ జర్జాపు దీప్తి, జెసి ఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, కౌన్సిలర్‌ లు రాపాక మాధవరావు, గొర్లి వెంకటరమణ,పప్పల లక్ష్మణరావు,మాజీ కౌన్సిలర్‌ తాడ్డి శంకరరావు, పరిశీలకులు శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️