గిరిజనాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

ప్రజాశక్తి – కురుపాం : గిరిజనాభివృద్ధికి వైసిపి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రహదారి, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనే లక్ష్యమని తమ అన్నారు. బుధవారం మండలంలోని తోటపల్లి -గుణుపూర్‌ రోడ్‌ జంక్షన్‌ నుంచి గొటివాడ గ్రామానికి రూ.1.20 కోట్లతో చేపట్టే 1.5 కిలోమీటర్ల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కురుపాం పంచాయతీ టేకరఖండి నుంచి బల్లుకోట వరకు 3.2 కిలోమీటర్లు మేర రూ.1.76 కోట్లతో నిర్మించిన బిటి రహదారిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శెట్టి పద్మావతి, జెడ్‌పిటిసి జి.సుజాత, సర్పంచ్‌ టి.తట్టమ్మ, ఎంపిటిసి సునీత, వైసిపి గ్రీవెన్స్‌ జిల్లా అధ్యక్షులు శెట్టి నాగేశ్వరరావు, వైసిపి వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు అందవరపు కోటేశ్వరరావు, వైసిపి మండల కన్వీనర్‌ ఐ.గౌరీశంకర్‌, కురుపాం మేజర్‌ పంచాయతీ ఉప సర్పంచ్‌ షేక్‌ ఆదిల్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️