డాక్టర్‌ సూర్యప్రకాష్‌కు ఘన సన్మానం

Mar 23,2024 20:46

గరుగుబిల్లి  :ఈ ప్రాంత ప్రజలకు మంచి వైద్యమందించాలన్న లక్ష్యంతో తన స్వగ్రామమైన రావుపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి నిష్ణాతులైన వైద్యులచే వైద్యం అందించిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ గుల్ల సూర్య ప్రకాష్‌ను శనివారం సన్మానించారు. ఆయనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్‌ ద్వారపురెడ్డి రామ్మోహనరావుతో పాటు రావుపల్లి మాజీ సర్పంచ్‌ గుల్ల కాశినాయుడు, మాజీ ఎంపిటిసి సభ్యులు అన్నపూర్ణమ్మ, కాపారపు శివున్నాయుడులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇంతటి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో వైద్యంతో పాటు ఖరీదైన మందులను అందజేయడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బొబ్బిలి ఏరియా హాస్పిటల్‌ సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ గుల్ల రామ్‌నరేష్‌, గుంట్రేడ్డి హరికుమార్‌, గుల్ల శంకరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో జరిగిన శ్రీసీతారామమందిర పున:ప్రతిష్ట మహౌత్సవం రెండో రోజైన శనివారం డాక్టర్‌ సూర్యప్రకాశరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

➡️