దోనుబాయిలో వైద్య శిబిరం

Mar 1,2024 20:50

సీతంపేట: మండలంలోని దోనుబాయిలో శుక్రవారం మెడికల్‌ క్యాంపు ఆ పోలీస్‌ స్టేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొండ డిఎస్‌పి జివి కృష్ణారావు మాట్లాడుతూ వైద్య శిబిరాలను గిరిజనులు వినియోగించుకోవాలని కోరారు. వైద్యాధికారులు మీ ముంగిటకు వచ్చి వైద్య సేవలందిస్తున్నారని దీన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఏడుగురు వైద్యాధికారుల బృదాలతో వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో పాలకొండ సిఐ చంద్రమౌళి, సీతంపేట, దోనుబాయి ఎస్సైలు ఎం.జగదీష్‌నాయుడు, అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

➡️