పార్వతీపురంలో చోరీ

Dec 12,2023 22:14

పార్వతీపురంరూరల్‌ :పట్టణంలో దొంగతనాలు జోరు రోజురోజుకు పెరిగిపోవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే సోమవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి కత్తులతో బెదిరించి బంగారం నగదు దోచుకుపోయిన సంఘటన పట్టణంలో సంచలనం రేకెత్తించింది. డిఎస్‌పి మురళీధర్‌ అందించిన వివరాల ప్రకారం… పట్టణంలోని వైకెఎం కాలనీకి చెందిన ఎస్‌.రాణి గత కొన్నేళ్లుగా అపరాల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. ఆమె భర్త కూడా అదే వ్యాపారాన్ని వేరే ఊర్లో చేయడం వల్ల ఒంటరిగా ఉంటుంది. సోమవారం అర్ధరాత్రి రాణి ఇంట్లో ఇద్దరు వ్యక్తులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఆమెకు కత్తి చూపించి బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారు. 14 తులాల బంగారం, రూ.70 వేలు నగదు దొంగతనానికి గురైనట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, విచారణ జరిపి అతి త్వరలోనే దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

➡️