ప్రతి ఒక్కరికీ సికిల్‌ సెల్‌ ఎనిమీయా పరీక్షలు

Feb 8,2024 21:26

 సీతంపేట : గిరిజన గ్రామాల్లో చేపడుతున్న సికిల్‌ సెల్‌ ఎనిమీయా పరీక్షలు 0 నుండి 40 ఏళ్లు వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ చేయాలని ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి అన్నారు. గురువారం కుసిమి పిహెచ్‌సిని పిఒ పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఎంఎల్‌హెచ్‌పిలు, ఎఎన్‌ఎంలతో సమావేశం నిర్వహిం చారు. సికిల్‌ సెల్‌ ఎనిమీయా పరీక్షలపై పలు సూచనలు చేశారు. ఇంకా గ్రామాల్లో, పాఠశాలల్లో టెస్టులు చేసుకోనివారుంటే వారిని గుర్తించి పరీక్షలు చేయాలని అన్నారు. ప్రతిరోజు చేసిన పరీక్షల రిపోర్టులను ఐటిడిఎ కార్యాలయానికి అందజేయాలని అన్నారు. అనంతరం హడ్డుబంగి, కె.గుమ్మడలోని విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను పిఒ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌హెచ్‌పిల వద్ద ఉన్న సికిల్‌ సెల్‌ ఎనిమీయా పరీక్షల రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️