బిజెపి ఎమ్‌పి అభ్యర్థి గీతకు నిరసన సెగలు

Apr 1,2024 21:23

కురుపాం : నకిలీ గిరిజన, ఆర్థిక నేరాలకు పాల్పడిన కొత్తపల్లి గీతకు బిజెపి అధిష్టానం ఎంపి టికెట్‌ ఎలా కేటాయించిందని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు హిమరక నీలకంఠేశ్వరరావు ప్రశ్నించారు. మండలంలో నీలకంఠాపురం పంచాయతీ కేంద్రంలో గిరిజన యువత, గిరిజనులతో కలిసి కొత్తపల్లి గీత టిక్కెట్లు రద్దు చేసి అచ్చమైన గిరిజనులకు కేటాయించాలని ప్లేకార్డులతో నినాదాలతో సోమవారం నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గీత ఎస్టీ కాదని కోర్టు కూడా తీర్పు ఇచ్చిందని అంతేకాకుండా ఆర్థిక నేరస్థురాలుగా ముద్ర ఉన్న వ్యక్తికి బిజెపి టికెట్‌ ఇవ్వడం సమంజసం కాదని, వెంటనే అచ్చమైన గిరిజనులకు టికెట్‌ కేటాయించాలని, లేనిచో ఆమెను ఓడించడానికి గిరిజనులు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో గిరిజన యువత, గిరిజనులు పాల్గొన్నారు

➡️