భారీగా బెల్లం ఊటలు ధ్వంసం

Mar 22,2024 21:28

పాచిపెంట: సాలూరు రూరల్‌ సిఐ జి.బాలకృష్ణ, స్థానిక ఎస్సై పి.నారాయణరావు ఆధ్వర్యాన ఒడిశాలోని సుంకి ఎస్సై, తన సిబ్బంది కలిసి సుంకి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల లావిడి, కాందిలి, ఒలిసి, పులి గుంట తదితర గ్రామాల్లో నాటు సారా తయారీ కేంద్రాలపై సంయుక్తగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 42,00 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేసి 140 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేశారు. స్వాధీనం చేసుకొన్న నాటుసారాను సుంకి పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై నారాయణరావు తెలిపారు.

➡️