మరో అవకాశమివ్వాలి : రాజన్నదొర

Mar 30,2024 20:58

సాలూరు : ఎమ్మెల్యేగా మరో అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుగులు పెట్టిస్తానని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. మండలంలోని పెదపదంలో ఆయన గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్‌పర్సన్‌ రెడ్డి పద్మావతి, వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తొలుత గ్రామంలో ఆయనకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు గురించి వివరించారు. మరో అవకాశమిస్తే మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. గడచిన ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. మంచి జరిగితే వైసిపికి ఓటు వేయాలని చెప్పిన సిఎం జగన్‌ ఒక్కరే నని చెప్పారు. టిడిపి నాయకులు చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మితే ప్రజలు మోసపోతారని చెప్పారు. కార్యక్రమంలో జెసిఎస్‌ కన్వీనర్‌ కళ్లేపల్లి త్రినాధ్‌నాయుడు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మామిడిపల్లిలో మండల వైసిపి అధ్యక్షులు సువ్వాడ భరత్‌ శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు సువ్వాడ రామకృష్ణ, పెద్దింటి మాధవ రావు ఇంటింటి ప్రచారం చేశారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. మరోసారి ఎమ్మెల్యేగా రాజన్నదొరను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సువ్వాడ శశికళ పాల్గొన్నారు.50 కుటుంబాలు వైసిపి లో చేరిక పట్టణంలోని మెంటాడవీధికి చెందిన సూపర్‌ బజార్‌ మాజీ డైరెక్టర్‌ మజ్జి అప్పారావు నాయకత్వంలో 50 కుటుంబాలు టిడిపిని వీడి వైసిపిలో చేరాయి. రాజన్నదొర నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు మజ్జి అప్పారావు చెప్పారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు కౌన్సిలర్‌ పప్పల లక్ష్మణరావు పాల్గొన్నారు.బలిజిపేట : మండలంలోని నారాయణపురంలో స్థానిక ఎమ్మెల్యే, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు వెంట పాల్గొన్నారు

➡️