విఒఎల సమస్యలు పరిష్కరించాల

Dec 20,2023 20:53

బలిజిపేట : గ్రామైక్య సంఘ సహాయకుల (విఒఎ) సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి ఇందిరా డిమాండ్‌ చేశారు. విఒఎల సమస్యల పరిష్కారానికై మండలం లోని వెలుగు కార్యాలయంలో బుధవారం సిసి మురళికు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఇందిరా సమక్షంలో వినతి పత్రాన్ని అందించారు. ఇందిరా మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, రాజకీయ జోక్యం నియంత్రించాలని, ఒత్తిడి తగ్గించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో విఒఎలు గౌరీశ్వరీ, జి. భారతి, సుమతి, సత్యవతి, శ్రీదేవి, దివ్య తదితరలు పాల్గొన్నారు.

➡️