సమస్యలు పరిష్కరించేంత వరకూ ఆందోళన

Dec 12,2023 22:04

సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు సమ్మెబాట పట్టారు. తెలంగాణాలో కంటే ఎక్కువ వేతనం ఇస్తామని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఫేస్‌యాప్‌ విధానం రద్దు చేయాలని, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, తదితర డిమాండ్లపై రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సమ్మెకు దిగారు. కలెక్టరేట్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌ కార్యాలయాల వద్ద మంగళవారం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నిరసన దీక్షలు చేపట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ సేవలు నిలిచిపోయాయి. ఈ సమ్మెకు టిడిపి, సిపిఎం, సిఐటియు, పలు ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపాయి. ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌దీర్ఘకాలంగా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్రవ్యాప్త పిలుపుమేరకు మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంట జ్యోతిలక్ష్మి అధ్యక్షతన నిరవధిక సమ్మెదీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ దేశానికి బలమైన భావి పౌరులను అందించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దే అపురూపమైన వ్యవస్థ అంగన్వాడీ అని అటువంటి వ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుగుణంగా మార్చుకుని నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా అనేక రకాలుగా ఆందోళనలు చేసినప్పటికీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం రాలేదని విమర్శించారు. న్యాయమైన వీరు డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. తొలుత యూనియన్‌ జిల్లా కార్యదర్శి జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీలను తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు ఇవ్వాలి, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలి డిమాండ్‌ చేశారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 ఏళ్లుపెంచాలని, రాజకీయ జోక్యం అరికట్టాలని, ఎఫ్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయాలని, అన్ని యాప్‌లు కలిపి ఒకే యాప్‌గా మార్చాలని, సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, భీమా అమలు చేయాలని, 2017 టిఎ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్‌ వయస్సు 62ఏళ్లకు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి. ప్రీ స్కూల్‌ బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ సెక్టార్‌ లీడర్లు ఎం.గౌరి, కె.రాజేశ్వరి, బి.శాంతి, పార్వతమ్మ, ధర్మవతి నీలవేణి, రాజేశ్వరి, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.సమ్మెకు టిడిపి, ప్రజాసంఘాల నాయకులు మద్దతుతమ సమస్యల సాధనకు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు చేపట్టిన నిరవదిక సమ్మెకు మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సంఘం జిల్లా కార్యదర్శి మన్నంగి హరినాథ్‌, పార్వతీపురం పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు బంకూరు సూరిబాబు తదితరులు పాల్గొని తమ మద్దతును తెలిపారు.బలిజిపేట : స్థానిక మెయిన్‌రోడ్‌ పక్కన అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ నిరసనుద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు కె.దాదమ్మ, ఇందిర, సావిత్రి, స్వర్ణ మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.కురుపాం : అంగన్‌వాడీల హక్కులు సాధించే వరకు నిరవధిక సమ్మెను సాగిస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర స్పష్టం చేశారు. స్థానిక పెట్రోల్‌ బంక్‌ సమీపంలో కురుపాం, జియ్యమ్మవలస మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టే నిరవధిక సమ్మెకు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పి.సరళా కుమారి, జిల్లా కార్యదర్శి జె.సరోజ, రెండు మండలాల అంగన్‌వాడీల సెక్టార్‌ లీడర్లు, కార్యకర్తలు, ఆయాలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.సాలూరు : అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు మున్సిపల్‌ కార్యాలయం ముందు జాతీయ రహదారి పక్కన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పట్టణ కమిటీ అధ్యక్షులు బి.రాధ, కార్యదర్శి వరలక్ష్మి, మండల కమిటీ అధ్యక్షులు ఎ.నారాయణమ్మ, కార్యదర్శి శశికళ, నాయకులు తిరుపతమ్మ,పార్వతి పాల్గొన్నారు.మక్కువ : స్థానిక ప్రధాన రహదారి అనుసరించి సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు ప్రభుత్వం తమను సమస్యలు పరిష్కరించాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎల్‌.దాలమ్మ, వై.పద్మ, వి.సుశీల, వి.గౌరి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని కేంద్రాల వర్కర్లు పాల్గొన్నారు.సీతానగరం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మండలంలోని అంగన్‌వాడీలు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు వెన్నెల రామలక్ష్మి, మరడ సత్యవతి, సెక్టార్‌ నాయకులు శైలజ, సునీత, రెడ్డి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మికసంఘం జిల్లా నాయకులు రెడ్డి ఈశ్వరరావు, సిఐటియు మండల కార్యదర్శి జి.వెంకటరమణ సంఘీభావం తెలిపారు.గుమ్మలక్ష్మీపురం : సమస్యల పరిష్కారం కోరుతూ భద్రగిరి ఐసిడిఎస్‌ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు గుమ్మలక్ష్మీపురంలో నిరవధిక సమ్మె చేపట్టారు. అంగన్వాడీల సమ్మెకు ఆదివాసీ గిరిజన సంఘం కోశాధికారి, చెముడుగూడ ఎంపిటిసి మండంగి రమణ, సిఐటియు మండల కార్యదర్శి కె. గౌరీశ్వరరావు, ట్రైబల్‌ రైట్‌ ఫోరమ్‌ రాష్ట్ర అధ్యక్షులు రోబ్బ లోవరాజు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్ష కార్యదర్శులు వై.కస్తూరి, సత్యవతి, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.సీతంపేట : అంగన్వాడీలు నిరవధిక సమ్మెలో భాగంగా తొలుత సీతంపేటలో నిరసన ర్యాలీ చేపట్టి, అనంతరం ఐటిడిఎ ముఖద్వారం వద్ద నిరవధిక సమ్మె చేపట్టారు. అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్ష కార్యద ర్శులు ఆరిక పార్వతి, ఆరిక దర్శమ్మి ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలకు టిడిపి నాయకులు పడాల భూదేవి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, మండల అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌.సురేష్‌, ఎం.కాంతారావు, సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.పాచిపెంట : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సమ్మె కార్యక్రమం సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు టి.ప్రభావతి ఆధ్వర్యంలో జరిగింది. ప్రభుత్వ సేవలు ఎంత కష్టమైనా ఇబ్బందులు ఎదుర్కొని సేవలు అందిస్తున్న అంగన్వాడీలకు భద్రత లేని విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదని ప్రభావతి అన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మెను కొనసాగిస్తామని అన్నారు. వీరి సమ్మెకు సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు సంఘీభావం తెలిపారు. గరుగుబిల్లి : అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మండలంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఎం సావిత్రి మాట్లాడారు. వీరి ఆందోళనకు సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు సరస్వతి, కాత్సాయిని, అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.పాలకొండ : ఎపి అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌( సిఐటియు) పాలకొండ ప్రాజెక్ట్‌ కమిటీ ఆధ్వర్యంలో పాలకొండలో అంగన్‌వాడీలు నిరసన ర్యాలీ ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు ఎన్‌.హిమాప్రభ, ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు జి.జెస్సీబాయి, బి.అమరవేణి, సెక్టార్‌ నాయకులు ఆర్‌.భవానీ, ఎన్‌.మణి, ఎన్‌.రాధ, ఎన్‌.లత, బి.వసుంధర, ధనలక్ష్మి, సిఐటియు మండల కార్యదర్శి కాద రాము, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దూసి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

➡️