ఘనంగా బక్రీద్‌ వేడుకలు

Jun 17,2024 21:26

కురుపాం : మండల కేంద్రమైన కురుపాంలో గల జామియా మసీదులో బక్రీద్‌ పండుగను పురస్కరించుకొని సోమవారం ఇమామ్‌ (మత గురువు) సర్దార్‌ ఆలం ఖాన్‌ ఆధ్వర్యంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత గురువు మాట్లాడుతూ బక్రీద్‌ పండుగ అల్లా ఆజ్ఞ మేరకు తన కన్న కొడుకునే త్యాగం చేయడానికి సిద్ధమైన దైవ దూత మహమ్మద్‌ ప్రవక్త త్యాగానికి ప్రతీకగా బక్రీద్‌ పండగ జరుపుకుంటారని అన్నారు. త్యాగం, దానం, సోదర భావం, భక్తి ఈ పండగ ముఖ్యోద్దేశ్యమని అన్నారు. నమాజ్‌ అనంతరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ ప్రత్యేక ప్రార్ధనలో కురుపాం ముస్లిం సోదరులతో పాటు చినమేరంగి, గుమ్మలక్ష్మీపురం ముస్లిం సోదరులు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.

➡️