మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంధ్యారాణి

Jun 17,2024 21:25

సాలూరు : రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సచివాల యంలో మూడో బ్లాక్‌లో ఆమె తొలి సంతకం చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే ఆమెతో తొలి ఫైల్‌పై సంతకం చేయించారు. కార్యక్రమంలో సంధ్యారాణి భర్త జయకుమార్‌, కుమారుడు పృథ్వి, తల్లి పార్వతమ్మ, అధికారులు పాల్గొన్నారు.

➡️