కృష్ణరాయపురంలో టిడిపి ప్రచారం

Apr 12,2024 21:27

 సీతానగరం: మండలంలోని కృష్ణరాయపురంలో టిడిపి అభ్యర్థి బోనాల విజరుచంద్ర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని, రాబోయే ఎన్నికల్లో టిడిపికి అధికారం ఇవ్వాలని, సైకిల్‌ గుర్తుపై ఓటుకు మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గొట్టాపు వెంకట నాయుడు, రౌతు వేణుగోపాలనాయుడు, పి.సత్యనారాయణ, పెద్దబ్బాయి, గ్రామ గ్రామ కమిటీ సభ్యులు పూడి శ్రీరాములు, గుణుపూరు తాతబాబు తదితరులు పాల్గొన్నారు.సాలూరురూరల్‌ : మండలంలోని కందులపధం, ముచ్చర్లవలస, నడిమివలసలో టిడిపి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ఇంటింటికి ప్రచారం చేశారు. మండల టిడిపి అధ్యక్షులు ఆముదాల పరమేష్‌ అధ్యక్షతన ముచ్చర్లవలసలో 150 మంది టిడిపిలో చేరారు. కంటపరపు కృష్ణ, బడ్నాన వెంకటనారాయణ, మంచాల రామసుందర్‌, కోదండ లక్ష్మణ, నర్రాల సూర్యనారాయణ, తదితరులకు సంధ్యారాణి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

➡️