ధర్నా గోడ పత్రికను విడుదల 

Jan 5,2024 12:25 #Manyam District
tribals release protest poster

ప్రజాశక్తి-జియ్యమ్మవలస : ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో జియ్యమ్మవలస మండలంలో ఉన్న గిరిజన గ్రామాలు అన్నింటికీ బీటీ రోడ్లు వేయాలని జనవరి 9వ తేదీన ఎంపీడీవో ఆఫీసు వద్ద ధర్నా జరుగుతుందని గోడ పత్రికను ఆదివాసి గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోరంగ సీతారాం బిల్లమానుగూడ గిరిజన గ్రామంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ బిల్లమాను గూడ. వనజ గ్రామానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంతవరకు రోడ్డు సౌకర్యం లేదని అన్నారు. ఎంతమంది నాయకులకు ఓట్లు వేసిన బిల్లమానుగూడకు రోడ్డు మంజూరు చేయలేదని, మండల కేంద్రానికి వెళ్ళాలన్న గిరిజనులు నిత్యవసర సరుకులు, రేషన్ బియ్యం, అటవీ ఉత్పత్తులు అన్ని తల పైన కాలినడక తీసుకువెళ్లాలని అభివృద్ధి అంటే ఇదేనా అని ఇది చాలా దుర్మార్గమని అన్నారు. ఇప్పటికైనా బీటీ రోడ్డు మంజూరు చేసి వెంటనే నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ బిళ్ళమాను గూడలో గిరిజనులతో నిరసన తెలియజేశారు. ఒక బిళ్ళ మాను గూడె కాకుండా మండలంలో ద్రాక్షని చాపరాయి గూడ, బాపన గూడ, ఆర్నాడ, చిన తోలు మంద, అర్నాడ వలస తుమ్మి గూడా దంగ భద్రవలస, చిలకల వానివలస, పసుపువాని వలస గిరిజన గ్రామాలకు సరైన రహదారి మార్గాలు లేవని గిరిజన గ్రామాలకు అన్నిటికీ వెంటనే బీటీ రోడ్లు మంజూరు చేసి నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 9వ తేదీన జియ్యమ్మ వలస మండల కేంద్రములో ఎంపిడీఓ ఆఫ్ఫీసు వద్ద ధర్నా కార్యక్రమం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బుతాల మోహన్ రావు, గిరిజనులు పాల్గొన్నారు.

➡️