గోతులు కప్పకపోతే ఆందోళన

May 20,2024 21:52

కొమరాడ : మండలంలో అంతర్‌ రాష్ట్ర రోడ్డుపై ఏర్పడ్డ గోతులు కప్పకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులకు కొల్లి సాంబమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు ఎ.ఉపేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. అంతర్‌రాష్ట్ర రహదారిపై కోటిపాం, గుమడ, కొమరాడ జూనియర్‌ కాలేజ్‌ సెంటర్‌ సమీపాన, ఈశ్వరుని దేవాలయం వద్ద, బంగారం పేట, ఇందిరా నగరం, చోళపదం సమీపాన, కూనేరు వద్ద ఉన్న పెద్ద పెద్ద గోతులను సిపిఎం నాయకులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన రెండున్నరేళ్లుగా ఇదే పరిస్థితి ఎక్కడైతే సిపిఎం ఇతర పార్టీలతో గోతుల వద్ద ఆందోళన చేస్తున్నా అక్కడే గోతులు తూతూ మాత్రంగా కప్పుతున్నారు తప్ప పూర్తి స్థాయిలో కప్పడంలేదన్నారు. దీంతో మళ్లీ గోతులు యథాస్థితికి వచ్చే పరిస్థితి ఉందన్నారు. జూన్‌ 10లోగా పనులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆ గోతుల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

➡️