మాచవరంలో ‘మేరుగు’ ఎన్నికల ప్రచారం

ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని మద్దులూరు గ్రామ పంచా యతీ పరిధిలోని బి మాచ వరం గ్రామంలో ఆదివారం రాత్రి ‘గడప గడపకూ మన నాగార్జున అన్న’ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి డాక్టర్‌ మేరుగు నాగార్జున నిర్వహిం చారు. ఆయనకు వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. హారతులు ఇచ్చి పూలదండలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతి వీధి తిరుగుతూ వైసిపికి, ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి రాష్ట్రంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అలాగే వైసిపి అభ్యర్థుల్ని గెలిపించి జగన్మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, సీనియర్‌ నాయకులు బొల్లినేని కృష్ణయ్య, జెడ్పిటిసి దుంపా రమణమ్మ, జేసీఎస్‌ కన్వీనర్‌ దుంపా యలమందారెడ్డి, మద్దులూరు గ్రామ సర్పంచ్‌ మైనం శైలజ-అమరనాథ్‌, గ్రామ నాయకులు మొలకలపల్లి సీతమ్మ-వెంకటేశ్వరరావు, దాసరి కోటి, చీదెళ్ల అర్జున్‌-రేవతి, ప్రత్తిపాటి స్వాములు, నన్నూరి సింగయ్య, మద్దులూరు, మాచవరం గ్రామ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️