ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ గా ఎమ్‌.కె బెహెరా బాధ్యతలు స్వీకరణ

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ అధికారి మోహెస్‌ కుమార్‌ బెహెరా ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ఇన్‌ చార్జ్‌ జనరల్‌ మేనేజర్‌ బాధ్యతలను స్వీకరించారు. ఆయన యూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ బుర్లా లో సివిల్‌ ఇంజినీరింగ్‌, ఐఐటీ మద్రాస్‌ నుండి ఓషన్‌ ఇంజినీరింగ్‌లో ఏం.టెక్‌ పట్టా పొందారు. ఆయన విస్తఅతమైన విద్యా నేపథ్యం కలిగి మూడు దశాబ్దాలుగా భారతీయ రైల్వే లకు సేవలందిస్తున్నారు. ఆయన గతం లో ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే చీఫ్‌ బ్రిడ్జ్‌ ఇంజనీర్‌, చీఫ్‌ ఇంజనీర్‌ (బ్రిడ్జ్‌ రిహాబిలిటేషన్‌) భువనేశ్వర్‌లోని గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌, పాట్నా, ముంగేర్‌లో తూర్పు మధ్య రైల్వే గంగా వంతెన ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న చీఫ్‌ ఇంజనీర్‌ (నిర్మాణం), సంబల్పూర్‌ డిప్యుటీ సీనియర్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ (కో-ఆర్డినేషన్‌) వంటి వంటి కీలక పదవుల తో పాటు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే లో చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ గాను పనిచేశారు.

➡️