సీజనల్‌ వ్యాధులపై పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే బత్తుల సమీక్షలు

Jun 16,2024 15:43 #meeting, #MLA, #officials

ప్రజాశక్తి – సీతానగరం (తూర్పు గోదావరి) : సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకఅష్ణ పంచాయతి అధికారులు, కార్యదర్శులను ఆదేశించారు. పారిశుధ్యం గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో పంచాయతి రాజ్‌ రూరల్‌ డెవలప్మెంట్‌ అధికారులతో ఎమ్మెల్యే బత్తుల బలరామకఅష్ణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఇఓపిఆర్‌ డి మహేశ్వర ప్రసాద్‌ వివిధ గ్రామాల్లోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకఅష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన చెత్త వేసే షెడ్లను సక్రమంగా వినియోగించుకోకపోవడం వలన రోడ్ల మీద చెత్త పెరుకుపోతుందని, పారిశుధ్యం మెరుగుపరిచేందుకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. వ్యర్ధ పదార్దాల సమగ్ర నిర్వహణకు ప్రతిపాదనలు తయారుచేసి తనకు ఇవ్వాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన తాగునీటి సరఫరా విషయంలో పంచాయతి కార్యదర్శుల పాత్ర అత్యంత కీలకమన్నారు. దీనిని దఅష్టిలో పెట్టుకుని ప్రజలకు ఏ విధమైన లోటుపాట్లు లేకుండా సురక్షితమైన తాగునీటిని అందించాలని ఆదేశించారు. ప్రజారోగ్యం విషయంలో ఏ విధమైన లోటుపాట్లు, సమస్యలు ఉన్నా తన దఅష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ సమావేశంలో కోరుకొండ మండలానికి చెందిన వివిధ గ్రామాల పంచాయతి కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️