కొత్తపల్లి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జక్కంపూడి

Mar 2,2024 14:25 #East Godavari, #mla jakkmpudi

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ నర్సరీ రైతు కొత్తపల్లి రామకృష్ణ కుటుంబాన్ని శనివారం రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరామర్శించారు.రామకృష్ణ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని వ్యక్తం చేశారు. కొత్తపల్లి కుటుంబంతో తనకెంతో అనుబంధం ఉందని అటువంటి చోట విషాదం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు . ముందుగా రామకృష్ణ చిత్రపటం వద్ద నివాళులర్పించిన రాజా కొత్తపల్లి స్వామి, కొత్తపల్లి శివాజీ, మూర్తి తదితరులకు ధైర్యం చెప్పారు. నివాళులు అర్పించిన వారిలో రత్నం స్వామి,ముత్యం జగదీష్, ఈలి సత్తిబాబు, మాజీ సర్పంచ్ సాపిరెడ్డి సూరిబాబు తదితరులు ఉన్నారు.

➡️