వాహనదారులు ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

Jun 13,2024 21:33

 ప్రజాశక్తి – కురుపాం : వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించి అన్ని ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని స్థానిక ఎస్సై షణ్ముఖరావు అన్నారు. గురువారం మూలిగూడ జంక్షన్‌ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ధ్రువీకరణ పత్రాలు లేని వాహనదారులకు అపరాధ రుసుం వేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించి అన్ని ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండి వాహనాలు నడపాలని సూచించారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులకు సూచించారు. కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️