మంత్రి ఆనంను కలిసిన ఎంపి ‘వేమిరెడ్డి’, మంత్రి ‘పొంగూరు’

Jun 17,2024 20:37
మంత్రి ఆనంను కలిసిన ఎంపి 'వేమిరెడ్డి', మంత్రి 'పొంగూరు'

మంత్రి ఆనంకు పుష్పగుచ్చం అందజేస్తున్న దృశ్యం
మంత్రి ఆనంను కలిసిన ఎంపి ‘వేమిరెడ్డి’, మంత్రి ‘పొంగూరు’
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు డాక్టర్‌ పొంగూరు నారాయణ, డిప్యూటీ మేయర్‌ రూప్‌ కుమార్‌ యాదవ్‌లు సోమవారం భేటి అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు సంతపేటలోని ఆనం నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆనం కుటుంబీకులు వేమిరెడ్డి, నారాయణ, రూప్‌ కుమార్‌ యాదవ్‌ లను శాలువాలతో సన్మానించారు.నెల్లూరు సిటీతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై వారు సుదీర్ఘంగా చర్చించుకున్నారు.

➡️