చిప్పాడలో ముత్తంశెట్టి ప్రచారం

ఎన్నికల ప్రచారంలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ప్రజాశక్తి -యంత్రాంగం తగరపువలస : భీమిలి మండలం చిప్పాడ, నారాయణరాజుపేట, కృష్ణంరాజుపేట, మద్దిలపేట గ్రామాల్లో వైసిపి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు ఎన్నికల ప్రచార సభల్లో ముత్తంశెట్టి మాట్లాడుతూ, సిఎం జగన్మోహన్‌రెడ్డి అమలుచేసిన సంక్షేమ పథకాలే తన విజయానికి దోహద పడతాయన్నారు. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దంతులూరి వాసు రాజు, చిప్పాడ సర్పంచ్‌ వి.రమాకుమారి, నాయకులు సూరిబాబు, సరగడ రఘునాధరెడ్డి, ఎంవి.రమణ పాల్గొన్నారు.ఉపాధి హామీ కూలీలను కలిసిన ప్రియాంక ఆనందపురం: మండలంలోని గండిగుండం, తర్లువాడ, పేకేరు పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను సోమవారం భీమిలి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమార్తె ముత్తంశెట్టి ప్రియాంక కలిసి శీతల పానీయాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ముత్తంశెట్టి శ్రీనివాసరావును, విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బంక సత్యం, మజ్జి వెంకటరావు, బిఆర్‌బి.నాయుడు, శ్రీనివాస్‌, ఇల్లాపు వెంకట్‌, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️