నా అల్లుడే దుర్మార్గుడు : అంబటి

May 6,2024 00:47

ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : కుటుంబంలో జరిగే విషయాలకు రాజకీయ రంగు పూలమటం దుర్మార్గమని వైసిపి సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. ఆయన అల్లుడు ఆయనపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో స్థానిక వైసిపి కార్యాలయంలో ఆదివారం ఆయన విలేర్లతో మాట్లాడారు. తన గెలుపు ఖాయమని భావించిన ప్రత్యర్థులు తన కుటుంబంలో నెలకొన్న వివాదాన్ని తెరపైకి తెచ్చారని, ఇందులో పవన్‌కల్యాణ్‌, చంద్రబాబు హస్తముందని ఆరోపించారు. తన అల్లుడు డాక్టర్‌ గౌతమ్‌ తనపై చేసిన ఆరోపణలపై పొన్నూరులో పవన్‌ కల్యాణ్‌ రాజకీయ రంగు పులిమినందకు స్పందిస్తున్నానని అన్నారు. చౌకబారు ఎత్తుగడలు తన వద్ద చెల్లవని, సత్తావుంటే రాజాకీయంగా ఎదుర్కోవాలని అన్నారు. నాలుగేళ్లుగా తన కుమార్తె, అల్లుడు విడాకులు వివాదం కోర్టులో విచారణలో ఉందని, తాను తన కుమార్తెకు అండగా నిలబడ్డానని చెప్పారు. తన కుమార్తె తోపాటు ఆమె కూతుర్ని వదిలేసి వెళ్లిన గౌతమ్‌ దుర్మార్గుడని విమర్శించా రు. పవన్‌, చంద్రబాబు వద్దకు వెళతానని గౌతమ్‌ గతంలోనూ తన కుమార్తెను బెదిరించాడని అన్నారు.

➡️