అర్జున్‌ రెడ్డి కాలనీ మంచినీటి కష్టాలు తీరుస్తాం

Dec 24,2023 16:42

అర్జున్‌ రెడ్డి కాలనీలో పర్యటిస్తున్న డోన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌

అర్జున్‌ రెడ్డి కాలనీ మంచినీటి కష్టాలు తీరుస్తాం
– డోన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌
ప్రజాశక్తి – డోన్‌
పట్టణంలోని అర్జున్‌ రెడ్డి కాలనీలో నెలకొన్న ప్రజల మంచినీటి కష్టాలను తీరుస్తామని డోన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌ తెలిపారు. ఆదివారం అర్జున్‌ రెడ్డి కాలనీలో మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జున్‌ రెడ్డి కాలనీలో మంచినీటి కోసం ప్రజలు చాలా సంవత్సరాల నుంచి సమస్యను ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే అక్కడికి నీళ్లు ఇవ్వడానికి అందుబాటులో ఉన్న మహాలక్ష్మి హాస్పిటల్‌ దగ్గర నుంచి పైపులైన్‌ కనెక్షన్‌ ఇవ్వాల్సిందిగా మున్సిపల్‌ అధికారులకు ఆదేశించారు. అర్జున్‌ రెడ్డి కాలనీలో మున్సిపాలిటీ వాటర్‌ లేకపోవడం వల్ల ప్రజలు బోర్ల ద్వారా నీటి సౌకర్యం పొందుతున్నారని, ప్రస్తుతం త్వరలో మున్సిపల్‌ వాటర్‌ ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కమలాపురం సర్పంచి రేగటి అర్జున్‌ రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎస్‌ఎండి.జాకిర్‌ హుస్సేన్‌, మున్సిపల్‌ డిఈ రసూల్‌, వైసిపి నాయకులు వంశీ తదితరులు పాల్గొన్నారు.

➡️