ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి తీరని లోటు : ఎస్‌టియు

Dec 15,2023 18:32

మాట్లాడుతున్న ఎస్టియు జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్‌ నాయక్‌

ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి తీరని లోటు : ఎస్‌టియు

ప్రజాశక్తి -ప్యాపిలి

ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, టీచర్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఎస్టియు జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్‌ నాయక్‌, ఎస్‌టియు ప్యాపిలి మండల నాయకులు చంద్రమౌళి,చిన్నపరెడ్డి, హాజీ మస్తాన్‌ వలి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ఎస్టియు ప్యాపి లి మండల ప్రాంతీయ కార్యాలయంలో ఎస్‌టియు నాయకులు సమావేశమై సేక్‌ సాబ్జి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలో పాల్గొని తిరిగి వెళుతుండగా ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు సమీపంలో రోడ్డు ప్రమాదంలో షేక్‌ సాబ్జి మృతిచెందడం బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు నాయకులు వెంకట్‌ నాయక్‌, చిన్నపరెడ్డి, మనోహర్‌, శేష నాయక్‌, చంద్రబాబు, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️