ఎస్మా ప్రయోగం హాస్యాస్పదం

Jan 6,2024 21:11

నంద్యాల జిల్లా కేంద్రంలో 24 గంటల నిరాహార దీక్షలో భాగంగా శిబిరంలోనే నిద్రిస్తున్న అంగన్‌వాడీలు

ఎస్మా ప్రయోగం హాస్యాస్పదం
– గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి
– సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు
– జిల్లా వ్యాప్తంగా 26వ రోజు అంగన్‌వాడీల సమ్మె
– నంద్యాలలో 24 గంటల రిలే నిరాహార దీక్ష
– మహానందిలో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే మద్దతు
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం హాస్యాస్పదంగా ఉందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు అన్నారు. సమ్మెలో భాగంగా 26వ శనివారం నంద్యాలలో అంగన్‌వాడీలు 24 గంటల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు ప్రారంభించి మాట్లాడారు. అంగన్వాడీలు గత 25 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. అంగన్వాడీల సమ్మె ఇతర సంఘాలు చేస్తున్న ఆందోళనకు స్ఫూర్తిదాయకమని అన్నారు. కనీస వేతనం రూ. 26 వేలు, విరమణ బెనిఫిట్స్‌ రూ. 5 లక్షలకు పెంచాలని అంగన్వాడీలు కోరుతుంటే అవి పరిష్కరించకుండా వయో పరిమితి పెంపు 60 నుండి 62 ఏళ్ల పెంచుతామని, విరమణ తరువాత 40 వేల నుండి లక్ష రూపాయలు అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు రూ. 29 వేల నుండి 40 వేలు ఇస్తామంటూ చెప్పడం వల్ల అంగన్వాడీలకు ఒరిగేది ఏమి లేదన్నారు. శ్రామిక మహిళా సంఘం నాయకురాలు టి.నిర్మల మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరైనది కాదన్నారు. ప్రభుత్వం తక్షణమే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 24 గంటల రిలే నిరాహార దీక్షలలో అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శి నాగరాణి, ప్రాజెక్ట్స్‌ కార్యదర్శి బి.సునీత, అంగన్‌వాడి టీచర్లు కె.మల్లేశ్వరి, రాధక్రిష్ట వేణి, సరస్వతి, శాంతి, రేణుక, వరలక్ష్మి, హేమలత, రత్నమ్మ, రవతి, జ్యోతి, మధురవాణి, ఆయాలు మదార్‌బీ, మల్లేశ్వరి, రామలక్ష్మి, రిబకమ్మ, ఏ.కుమారి, వెంకట సుబ్బమ్మ, మినీ అంగన్‌వాడి టీచర్‌ తిరుపాలమ్మ తదితరులు కూర్చున్నారు. ఈ దీక్షలకు డివైఎఫ్‌ఐ నాయకులు శివ, న్యాయవాదులు శ్రీనివాస మూర్తి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డిమహానంది : మహానంది తహశీల్దార్‌ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు చేపట్టిన సమ్మెకు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మాచట్టం ప్రయోగించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఎన్నికలకు ముందు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వాటిని తుంగలో తొక్కారన్నారు. ఎస్మా చట్టం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిదన్నారు. రాబోయేది టిడిపి ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడిల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో టిడిపి శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త రెడ్డి, మండల నాయకులు ఉల్లి మధు, కాకర్ల శివ, అస్లాం బాష, తదితరులు పాల్గొన్నారు. రుద్రవరం : రుద్రవరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు 26వ రోజు సమ్మెను కొనసాగించారు. అంగన్వాడి నాయకురాళ్ళు మనోజ, పద్మ, రాజ్యలక్ష్మి, బిబి, నాగలక్ష్మి, లలితమ్మ, తిరుపాలమ్మ తదితరులు పాల్గొన్నారు. పాణ్యం : స్థానిక ఎంపీడీవో ఆఫీస్‌ ముందు అంగన్వాడి వర్కర్స్‌ తమ సమస్యల పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెకు టిడిపి నాయకులు మద్దతు తెలిపారు. టిడిపి మండల నాయకులు లీగల్‌ సెల్‌ లాయర్‌ బాబు, కొండ జూటూరు మాజీ సర్పంచ్‌ నారాయణ, యాకోబు, కేశవ, ఇర్ఫాన్‌, నెరవాడ అమరసింహారెడ్డి, తదితరులు మాట్లాడారు. అంగన్వాడీ యూనియన్‌ మండల నాయకురాలు వెంకటమ్మ, మాబునిస, శ్యామల, మరియమ్మ, హైమావతి, సూర్య ప్రభావతి, అనసూయ, లక్ష్మీదేవి, ప్రభావతి, శివమ్మ, వెంకటమ్మ, భారతి , విద్యార్థి సంఘం నాయకులు ప్రతాప్‌, వెంకటాద్రి పాల్గొన్నారు.

➡️