కంచాలను గరిటతో మోగిస్తూ నిరసన

Dec 26,2023 16:50
అంబేద్కర్ సర్కిల్లో కాళీ కంచాలను గరిటతో మోగిస్తూ నిరసన వ్యక్తపరుస్తున్న అంగన్వాడీలు
కంచాలను గరిటతో మోగిస్తూ నిరసన
హామీలను అమలు చేయాలని 15వ రోజు సమ్మె
అంగన్వాడీల సమ్మెకు.. ఆశల మద్దతు… 
ప్రజాశక్తి – ఆత్మకూర్
     ప్రభుత్వం స్పందించి అంగనవాడిలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్  కార్యదర్శి మంజుల, నాయకురాలు లక్ష్మీదేవి, ప్రమీలమ్మ, సిఐటియు పట్టణ కార్యదర్శి రామ్ నాయక్, ఉపాధ్యాక్షులు రణధీర్ లు అన్నారు. మంగళవారం పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె 15రోజు చేపట్టి కుటుంబ సభ్యులతో కాళీ కంచాలు, గరిటలను మోగిస్తూ నిరసన తెలియజేశారు.  ఈ సందర్బంగా మాట్లాడుతూ   వైయస్సార్ సంపూర్ణ పోషణ మెను చార్జీలు పెంచాలన్నారు. గ్యాసును ప్రభుత్వమే సరపరా చేయాలన్నారు. 2017 నుండి పెండింగ్ లో ఉన్న టిఏ బిల్లులు ఇవ్వాలన్నారు.  లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని పంపిణీ చేయాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలన్నారు. ప్రమోషన్ లో రాజకీయ జోక్యం అరికట్టాలి, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో   ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు కవిత, వాణి, విజయలక్ష్మి, లక్ష్మీదేవి, సుజాత, సుధారాణి, వెంకటలక్ష్మి, లక్ష్మి, ప్రియాంక, ప్రమీల, రవణమ్మ, అరుణ, తదితరులు పాల్గొన్నారు.
 అంగన్వాడీల సమ్మెకు.. ఆశాల మద్దతు… 
     అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని, ఆశా కార్యకర్తలు కనీస వేతనం ఇవ్వాలని పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆశా, అంగన్వాడి కార్యకర్తలు ధర్నా నిర్వహించి తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. కమ్యూనిటీ హెల్త్  వర్కర్స్ ని ఆశాలుగా మార్పు చేయాలన్నారు. పని భారం తగ్గించాలని, రూ.10 పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5లక్షలు, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని, ఏఎన్ఎం హెల్త్  సెక్రటరీల నియామకాల్లో  ఆశా కార్యకర్తలకు వెయిటేజ్ ఇవ్వాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు భారతి, వరలక్ష్మి, అపర్ణ, జ్యోతి, లక్ష్మీ బాయి, ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు.
➡️