కబడ్డీ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ

Jan 3,2024 16:21

కబడ్డీ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేస్తున్న దృశ్యం

కబడ్డీ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ
ప్రజాశక్తి – పగిడ్యాల
అండర్ -17 కబడ్డీ క్రీడాకారులకు పాఠశాల పూర్వ విద్యార్థి రమేష్ గౌడ్ క్రీడా దుస్తులను పంపిణీ చేయడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రావు తెలిపారు. బుధవారం పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నా అండర్ 17 కబడ్డీ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రావు మాట్లాడారు. పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థిగా చదువుకున్న రమేష్ గౌడ్ పాఠశాల మీద ప్రేమతో క్రీడలపై మక్కువతో ఈ పాఠశాలలో ఉన్న క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఇదే పాఠశాలలో చదువుకొని ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉన్నారని అన్నారు. ఎక్కడో ఉండి వారి బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ చిన్ననాటి నుండి చదువుకున్న పాఠశాలలను గుర్తు పెట్టుకొని పాఠశాల అభివృద్ధి కోసం వారి వంతు సహా సహకారాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పూర్వ విద్యార్థులు విద్యార్థులు ఎవరో ఒకరు ఏదో రకంగా పాఠశాల అభివృద్ధి కోసం సహకరిస్తున్నారని అన్నారు. 12 మంది అండర్ 17 కబడ్డీ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందించడం జరిగిందన్నారు. క్రీడా దుస్తులను అందజేసిన దాత రమేష్ గౌడ్ ను పాఠశాల ఉపాధ్యాయ బృందం దృశ్యాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రషీద్ మియ్య, సుదర్శన్ రెడ్డి, మోహన్ దాస్, క్రీడా శ్రీ తోకల పితాంబ రెడ్డి, కోచ్ శివ తదితరులు పాల్గొన్నారు.

 

➡️