గడ్డివాము దగ్ధం

Jan 13,2024 19:22

మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

గడ్డివాము దగ్ధం

ప్రజాశక్తి – పాములపాడు

పాములపాడు గ్రామంలోని రైతు వెంకటేశ్వర్లుకు చెందిన గడ్డివాము దగ్ధమైంది. స్థానికుల వివరాల మేరకు వెంకటేశ్వర్లు రెండు ఎకరాల గడ్డిని కొనుగోలు చేసి పశుగ్రాసం కొరకు వాము వేసుకున్నాడు. శనివారం గడ్డివాము అంటుకో వడంతో స్థానికులు నీళ్లతో ఆర్పే ప్రయత్నం చేశారు. ఆత్మకూరు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఫైర్‌ సిబ్బంది ఫైర్‌ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. రైతు వెంకటేశ్వర్లకు సుమారు రూ.30 వేల దాకా నష్టం వాటిల్లింది ప్రమాదానికి కల కారణం ఆకతాయిల పనే ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్‌ సిబ్బంది ఎస్‌ఎఫ్‌ఓ భీముడు నాయక్‌, ఐఎఫ్‌ కరిముల్లా, డిఆర్‌ఓపి మహమ్మద్‌ గౌస్‌ పాల్గొన్నారు.

➡️