గెలుపు కోసం కృషి చేయండి

Dec 15,2023 18:53

పార్టీ గెలుపు కోసం కషి చేయాలని కార్యకర్తలతో మాట్లాడుతున్న ధర్మవరం సుబ్బారెడ్డిపార్టీ

గెలుపు కోసం కృషి చేయండి

ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి

ప్రజాశక్తి – బేతంచెర్ల

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని డోన్‌ నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి సూచించారు. శుక్రవారం బేతంచెర్ల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మండల కన్వీనర్‌ ఉన్నం ఎల్ల నాగయ్య అధ్యక్షతన టిడిపి నాయకులు, కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న డోన్‌ నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని నాయకులకు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. సైకో జగన్‌ పాలనలో అన్ని రంగాలలో అభివృద్ధి వెనుకబడిందని ప్రజలు విసుగెత్తిపోయారని ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్‌ రెడ్డిని ఓడించాలని అన్నారు. నిత్యం పిట్టకథలు చెప్పే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డిని ఇంటికి పంపి ంచడం ఖాయమని వారు అన్నారు. కనుక పాలక ప్రభుత్వాలు బెదిరింపులకు పాల్పడిన అధైర్య పడకుండా ప్రజలతో మమేకమై పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు పోలూరు వెంకటేశ్వర రెడ్డి, టిడిపి సీనియర్‌ నాయకులు పోలూరు రాఘవరెడ్డి, మండల సమన్వయ కమిటీ చైర్మన్‌ ఉన్నం చంద్రశేఖర్‌, పట్టణ సమన్వయ కమిటీ చైర్మన్‌ ఉన్నం సుధాకర్‌, గౌరవ సలహాదారులు కాకర్ల తిరుమలేశ్‌ చౌదరి, క్లస్టర్‌ ఇంచార్జ్‌ రమేష్‌, జాకీర్‌ మాజీ ఎంపీటీసీ, డోన్‌ నియోజకవర్గం బీసీ సెల్‌ అధ్యక్షుడు ఎర్రమల నాయుడు, టిడిపి యువ నాయకులు మన్నె గౌతమ్‌ రెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్‌ కార్యదర్శి రవీంద్ర నాయక్‌, జావాజీ వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి రాజగోపాల్‌ రెడ్డి, శశి కుమార్‌ అప్ప, వెంకట రాముడు, రాధాకృష్ణ, తిరుమలేష్‌ రెడ్డి, ధోని రామాంజనేయులు, ఎల్ల స్వామి, గోరుమానుకొండ జంగమయ్య, అంజి, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సిమెంట్‌ నగర్‌ రాముడు, ఉరుకుందు, వాసు, సురేష్‌, చంద్ర, ఆంజనేయులు, జగదీష్‌, జనార్ధన్‌, అత్తి నాయక్‌, పట్టణ ఉపాధ్యక్షుడు శ్రీధర్‌, సతీష్‌ కుమార్‌, బాలరాజు, సత్యం, వలి, మద్దయ్య, మోహన్‌ రెడ్డి, మహేష్‌ యాదవ్‌, మౌలాలి, రవి, ముసలాయి చెరువు పుల్లయ్య, నారాయణరెడ్డి, ఈరన్న, తిమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️