ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Dec 24,2023 18:40

నాటి గురువులతో పూర్వ విద్యార్థులు

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ప్రజాశక్తి – ఆత్మకూరు
ఆత్మకూరు పట్టణంలోని తోటగేరిలో ఉన్న శ్రీ పద్మావతి హైస్కూల్‌లో 1997-98 సంవత్సరం పదవ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు దాదాపు 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని సంతోషంగా గడిపారు. ఇక్కడ చదవిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి దేశ, విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. నాడు తమకు విద్యాబుద్దులు నేర్పిన గురువులను సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపల్లి ఎంఇఒ-2 ఇనాయతుల్లా మాట్లాడుఊ 25 సంవత్సరాల తరువాత తమను పిలించి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం, ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందనారు. పాఠశాల అకాడమిక్‌ డైరెక్టర్‌ పి.ఆశ మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణతో పేద విద్యార్థులకు విద్యాబోధన అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఇదే విధంగా గత 30 సంవత్సరాలుగా చదువుకున్న విద్యార్జులందరికీ తమవంతుగా గురువులను గౌరవించి కృతాజ్థాభివందనములు తెలియజేసే బాధ్యత ఉందన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఇంతియాజ్‌, లోకేంద్ర, దివాకర్‌, దిలీప్‌, గోకారి, అన్వర్‌, శ్రీధర్‌ తదితరులు గురువులను దుశ్శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రమాదేవి, రామారావు, సూర్య నారాయణ, నాగేశ్వర రాజు, సురేంద్ర, అహ్మద్‌ హుస్సేన్‌, బాషా, గౌస్‌ బాషా, మధు తదితరులు పాల్గొన్నారు.

➡️