పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివి:టిడిపి

Dec 15,2023 17:12

నివాళ్లులర్పిస్తున్నబిసి రాజారెడ్డి తదితరులు

పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివి:టిడిపి
ప్రజాశక్తి – బనగానపల్లె
అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని పట్టణ మాజీ సర్పంచి బిసి రాజారెడ్డి, టిడిపి వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు టంగుటూరి శీనయ్యలు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని మాజీ సర్పంచి కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బిసి రాజా రెడ్డి, టంగుటూరి శీనయ్యల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. అటువంటి మహనీయునికి రెండు తెలుగు రాష్ట్రాల కేంద్రాలల్లో ప్రభుత్వాలు స్మృతి వనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి సంవత్సరం జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో లాయర్‌ నాగేంద్ర రెడ్డి, టిడిపి కోశాధికారి ఖాదర్‌, నాయకులు బత్తుల భాస్కర్‌ రెడ్డి, డేగల వీరన్న, ఆర్యవైశ్య సంఘం నాయకులు కాసుల జంగం శెట్టి, బచ్చు భాస్కర్‌ రామ్‌ గోపాల్‌, రిటైర్డ్‌ ఉపాధ్యాయులు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

➡️