ప్రతిభను వెలికి తీసేందుకే ‘ఆడుదాం-ఆంధ్ర’ : వైసిపి

Dec 24,2023 16:41

మారథాన్‌కు తరలి వెళుతున్న వైసిపి నాయకులు

ప్రతిభను వెలికి తీసేందుకే ‘ఆడుదాం-ఆంధ్ర’ : వైసిపి
ప్రజాశక్తి – పగిడ్యాల
గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆడుదాం-ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వైసిపి మండల కన్వీనర్‌, మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం-ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం కర్నూల్‌లో జరిగిన మారథాన్‌ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నాయకులు తరలి వెళ్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుల్యాల నాగిరెడ్డి మాట్లాడారు. క్రీడాకారుల కోసం ఈ నెల 26వ తేదీన ఆడుదాం-ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆడుదాం-ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వైసిపి రాష్ట్ర యువజన అధ్యక్షులు శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పిలుపు మేరకు కర్నూల్‌లోని స్టేడియం నుంచి వైయస్సార్‌ సర్కిల్‌ వరకు జరిగిన మారథాన్‌ కార్యక్రమంలో పగిడ్యాల నాయకులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పగిడ్యాల సర్పంచి పెరుమాళ్ళ శేషన్న, మోక్షం రెడ్డి, సుధాకర్‌, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️