బెదిరింపులకు దిగితే మూల్యం తప్పదు

Jan 13,2024 17:53

గుమ్మడికాయలను పగలగొడుతూ నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు

బెదిరింపులకు దిగితే మూల్యం తప్పదు
సిఐటియు, ఎపి అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌
– 33వ రోజూ అంగన్వాడీల నిరవధిక సమ్మె
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
అంగన్వాడీలకు వేతనాలు పెంచకుండా విధుల్లో చేరాలని ప్రభుత్వం బెదిరింపులకు దిగితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, ఎపి అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నిర్మలమ్మ, ప్రాజెక్ట్‌ కార్యదర్శి బి.సునీత, జిల్లా నాయకురాలు నాగరాణి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీల నిరవధిక సమ్మె శనివారం 33వ రోజు కొనసాగింది. నంద్యాల జిల్లా కేంద్రంలో అంగన్వాడీలు బూడిద గుమ్మడికాయలు పగలకొట్టి ప్రభుత్వంపై నిరసన తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందన్నారు. చర్చలకు పిలిచి ఆర్ధిక పరమైన అంశాలను పరిష్కరించలేమని మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు దాటావేసే ధోరణితో వ్యవహరించడం, సమ్మెను విరమించాలని, విధుల్లో చేరాలని లేకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామని బెదిరించే ధోరణిలో మాట్లాడడం తగదన్నారు. తక్షణమే అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సెక్టార్‌ లీడర్స్‌ ప్రసన్న, సరస్వతి, నీలిమ, లలితమ్మ, సునీత, వరలక్ష్మి, సారమ్మ, సావిత్రీ, అరుణ, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️