బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్ట్ను రాజకీయం చేయడం తగదు

Jan 3,2024 16:31

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్ట్ను రాజకీయం చేయడం తగదు
మా ప్రభుత్వం ప్రమేయం లేదు…
2016లో కేసు… కోర్టు, ఎన్నికల ఆదేశాలతోనే పోలీసులు అరెస్టు చేశారు
రికాల్ చేసుకోమని జిల్లా ఎస్పీ చెప్పినా ఉద్యమ నాయకులు పట్టించుకోలేదు
నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్ట్ ను ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయం చేయడం తగదని, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డిపేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ నేతలు జైలుపాలు చేస్తున్నారని, రాజకీయ బురదజల్లే ప్రతిపక్ష నాయకుల ఆరోపణల్లో వాస్తవాలు లేవని ఎమ్మెల్యే అన్నారు. బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్ట్ పై ప్రతిపక్షాలు చేసిన వాఖ్యలపై ఎమ్మెల్యే బుధవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయలసీమ సాగునీటి సమితి బొజ్జ దశరథరామిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచడం జరిగిందన్నారు. 2016 సంవత్సరం మేనెల 31వ తేదీలో రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి, రైతులు సంగమేశ్వరం సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రజా శంకుస్థాపన కోసం పిలుపునిచ్చిన నేపథ్యంలో బొజ్జ దశరథరామిరెడ్డి,రైతు నాయకులపై ఆనాటి టీడీపీ ప్రభుత్వంలో పోలీసులు కేసులు పెట్టడం జరిగిందన్నారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో పెట్టిన కేసుల పై అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పెట్టిన కేసులకు సంభందించి నేడు ధశరథరామిరెడ్డిని, రైతునాయకులను అరెస్ట్ చేస్తే అది వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు వారిపై అనవసరంగా కక్షపూరితంగా కేసులు బనాయించి అరెస్ట్లు చేయిస్తున్నారని ప్రతిపక్షనాయకులు తమ పార్టీ పై, నాయకులపై బురదజల్లే రాజకీయాలు చేయడం తగదన్నారు. అరెస్టు అయిన బొజ్జ దశరథరామిరెడ్డితో తాను స్వయంగా మాట్లాడటం జరిగిందని, కేసులకు, అరెస్ట్ సంబంధించిన పూర్తి వివరాలను, వాస్తవాలను తెలుసుకున్నామన్నారు. నాడు చేపట్టిన రాయలసీమ సాగునీటి సమితి ఉద్యమంలో పార్టీలకు అతీతంగా వైఎస్సార్సీపీ నాయకులు కూడా పాల్గొన్నారని గ్రహించాలన్నారు. రైతుల పక్షాన నిలిచిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని. ప్రతి రైతు మేలుకోరి ప్రభుత్వ అని తెలిపారు. ఎన్నికలు వస్తున్నాయని రాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రతిపక్షనాయకులకు హితవు పలికారు. బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్టు వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.

 

 

➡️