బొబ్బిలి ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం

Dec 15,2023 16:38

బొబ్బిలి ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం
ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్
అంగన్వాడి మహిళల పట్ల దురుసుగా మాట్లాడిన బొబ్బిలి ఎమ్మెల్యే దిష్టిబొమ్మను శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర దగ్ధం చేయడం జరిగింది. అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో పి మదర్ బి అధ్యక్షతన దిష్టిబొమ్మ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం అక్కడి నుండి పటేల్ సెంటర్ మీదుగా ర్యాలీగా వెళ్లి ఐసిడిఎస్ కార్యాలయం ముందు ధర్నా చేసి ఏ సి డి పి ఓ అధికారి మంగ వల్లి కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం నాగేశ్వరావు సిఐటియు పట్టణ కార్యదర్శి టి గోపాలకృష్ణ మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వెంకట చిన అప్పల్ నాయుడు అంగన్వాడీలు చేస్తున్న ఆందోళన పట్ల ఆయన అంగన్వాడి మహిళలు ఒళ్ళు బలిసి సమ్మె చేస్తున్నారని అసభ్యకరంగా మాట్లాడి మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కించపరిచిన ఎమ్మెల్యే ను వెంటనే బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మహిళల ఓట్లతో ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యే ఇలా కించపరిచి మాట్లాడడం సరైంది కాదని వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీ మహిళలు గత అనేక సంవత్సరాల నుండి చిన్న పిల్లలకు, బాలింతలకు ,గర్భవతులకు పౌష్టికారని అందిస్తూ అనేక సేవలు చేస్తు కేవలం రూ 7 వేల గౌరవ వేతనానికి కి పనిచేస్తున్న వీరికి 15 రకాల పని భారాన్ని పెంచి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించకుండా శ్రమదోపిడి చేసుకుంటూ అంగన్వాడీలు మరణించిన తర్వాత ఎలాంటి పరిహారం ఇవ్వకుండా, రిటైర్డ్మెంట్ అయిన తర్వాత గ్రాడిటి ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని గత నాలుగున్నర సంవత్సరాలుగా అనేక ఆందోళనలు చేసి వినతి పత్రాలు సమర్పించిన గత్యంతరం లేని పరిస్థితిలో సమ్మెకు వెళ్లడం జరిగిందని సమ్మె చేస్తున్న మహిళలను లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్న శాసనసభ్యులు పదవి అనంతరం పింఛన్ పొందుతారు అటువంటి వ్యక్తి మహిళల పట్ల దురుసుగా మాట్లాడడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు నాగన్న ఆంజనేయులు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ నాయకులు డి వెంకట లక్ష్మి, టి ప్రభావతి ,జే అరుణాదేవి ,లలిత, శాంతకుమారి ,లక్ష్మీ, ఉమాదేవి ,అరుణ ,సుభాషిని, కృష్ణవేణి, అక్కమ్మ, కీర్తి తదితరులు పాల్గొన్నారు

➡️