మాండ్ర సమక్షంలో టిడిపిలో చేరిక

Jan 8,2024 19:31

 

టిడిపిలోకి చేరిన నేతలు

మాండ్ర సమక్షంలో టిడిపిలో చేరిక

ప్రజాశక్తి – నందికొట్కూరు

నందికొట్కూరు పట్టణంలోని మున్సిపాలిటీ 29వ వార్డు కోట వీధికి చెందిన దాదాపు 20 కుటుంబాలు కౌన్సిలర్‌ భాస్కర్‌ ఆధ్వర్యంలో సోమవారం చేరాయి. కమతం కృష్ణ, కమతం పుల్లారెడ్డి, సుబ్బారెడ్డి, చిన్న సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు, సురేష్‌, శంకర్‌, రాజేష్‌, దినేష్‌, మహేష్‌, యుగంధర్‌, అశోక్‌, వెంకటేష్‌, ప్రసాద్‌, రవి, శివ, మధు, లింగస్వామి, చంద్రశేఖర్‌, జగదీష్‌, నంద్యాల పార్లమెంట్‌ ఇన్చార్జ్‌ మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ మాండ్ర కండువా కప్పి ఆహ్వానం పలికారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి అరాచక పాలన నచ్చక వారంతా తమ పార్టీలో చేరారని, రాబోవు స్థానిక ఎన్నికలలో టిడిపి ప్రభుత్వానికి గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్‌ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ జయ సూర్య, ఖాతా రమేష్‌ రెడ్డి, ఓబుల్‌ రెడ్డి, నారపురెడ్డి, పట్టణ నాయకులు చిన్న పుల్లారెడ్డి, చంద్రారెడ్డి, ముత్తు జావలి, జమీల్‌, రసూల్‌, నిమ్మకాయల మోహన్‌, మల్లికార్జున్‌ రెడ్డి, కృష్ణారెడ్డి, కళాకర్‌, బో ల్లెద్దుల రాజన్న, తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.

➡️