యాదవ సంఘం నాయకుడు మృతి

Jan 31,2024 16:50

మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న యాదవ సంఘం నాయకులు

యాదవ సంఘం నాయకుడు మృతి
ప్రజాశక్తి – బనగానపల్లె
యాదవ సంఘం నాయకులు నక్క రామస్వామి యాదవ్ మృతి యాదవ సంఘానికి తీరని లోటు అని అఖిలభారత యాదవ మహాసభ బనగానపల్లె నియోజకవర్గ కన్వీనర్ జి మద్దయ్య యాదవ్ ,మండల అధ్యక్షులు నట్టల గణ మద్దిలేటి యాదవ్ లు పేర్కొన్నారు. బుధవారంబనగానపల్లె మండలం చెర్ల కొత్తూరు గ్రామానికి చెందిన యాదవ సంఘం నాయకులు నక్క రామస్వామి యాదవ్ గుండెపోటుతో మృతి చెందారు. రామస్వామి యాదవ్ మృతదేహానికి అఖిలభారత యాదవ మహాసభ బనగానపల్లె నియోజకవర్గం కన్వీనర్ జి మద్దయ్య యాదవ్, బనగానపల్లె మండల అధ్యక్షులు నట్టల గణ మద్దిలేటి యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి రాళ్ల కొత్తూరు శంకర్ యాదవ్, క్రిష్ణగిరి మాజీ సర్పంచ్ పర్లపాటి నాగ శేషుడు యాదవ్, నాయకులు వేములపాడు సుధాకర్ యాదవ్, కటికవానికుంట బాలరాజు యాదవ్, తిమ్మరాజు యాదవ్, కృష్ణగిరి రంగస్వామి యాదవ్, శివ కృష్ణ యాదవ్ లతోపాటు యాదవ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామస్వామి యాదవ్ మృతి యాదవ సంఘానికి తీరని లోటు అన్నారు. యాదవ సంఘం అభివృద్ధికి రామస్వామి యాదవ్ ఎంతో కృషి చేశారని తెలిపారు.

➡️