వి. తిమ్మాపురంకి రూ.6 కోట్ల సంక్షేమ పథకాలు

Jan 7,2024 20:56

వైసిపి జెండాను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే

వి. తిమ్మాపురంకి రూ.6 కోట్ల సంక్షేమ పథకాలు

– ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి

ప్రజాశక్తి – మంత్రాలయం

వైసిపి ప్రభుత్వ పాలనలో మండల పరిధిలోని వగరూరు తిమ్మాపురం గ్రామానికి మాత్రమే రూ.6 కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, వైసిపి యువ నేత వై ప్రదీప్‌ రెడ్డి అన్నారు. ఆదివారం తిమ్మాపురం గ్రామంలో వైసిపి జండాను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా గ్రామ పొలిమేరల నుంచి బైక్‌ ర్యాలీతో స్వాగతం పలికారు. గ్రామానికి చేరుకున్న వారు ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైసిపి జండాను ఆవిష్కరించారు. శాలువలతో క్రేన్‌ ద్వారా గజమాలతో పాటు పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తిమ్మాపురం గ్రామం నుంచి జరిగిన ఎన్నికల్లో మెజారిటీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి ఇంచార్జీ విశ్వనాథ్‌ రెడ్డి గ్రామ వీరారెడ్డి, వగరూరు సర్పంచ్‌ లింగారెడ్డి, సిఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ వేణుగోపాల్‌, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️