దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 16 న సమ్మె : ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌

కొండపల్లి (ఎన్‌టిఆర్‌) : కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వ కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా , కార్మిక , రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఫిబ్రవరి 16 న దేశవ్యాప్తంగా జరిగే సమ్మె జయప్రదం చేయాలని ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ సిఐటియు జాతీయ కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్య పిలుపునిచ్చారు. డ్రైవర్స్‌కి నష్టదాయకమైన ఉరితాడుగా మారిన హిట్‌ అండ్‌ రన్‌ కేసు రద్దు చేయాలని కోరారు. జరిమానా జైలు శిక్ష డ్రైవర్స్‌ విధించిండటంపై ఆవేదన వ్యక్తం చేశారు రోడ్లు ముందు బాగు పరచాలని, డ్రైవర్స్‌ సంక్షేమ కోసం బోర్డు ఏర్పాటు చేయాలని, చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్న డ్రైవర్స్‌ పై ఇలాంటి హిట్‌ అండ్‌ రన్‌ కేసు లు తీసుకురావటం డ్రైవర్స్‌ తో స్టీరింగ్‌ బంద్‌ చేయటం తప్ప మరొకటి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ కీ వేతన ఒప్పందం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా సంస్థ అభివఅద్ధి కోసం పనిచేస్తున్న కాంట్రాక్టు వర్కర్స్‌ సమస్యలు పరిష్కరించాలని కోరారు. సిఐటియు ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌ సిహెచ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ … డ్రైవర్స్‌ , కాంట్రాక్టు వర్కర్స్‌ కీ కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. డ్రైవర్స్‌కు నష్టదాయకమైన చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం మహేష్‌, హెచ్‌పిసిఎల్‌ ఆయిల్‌ డ్రైవర్స్‌ యూనియన్‌, సిఐటియు మండల ప్రెసిడెంట్‌ ఎస్‌ సుందరరావు, కార్యదర్శి బాలకృష్ణ, హెచ్‌పిసిఎల్‌ ఆయిల్‌ సెక్రటరీ శేషాగిరి, కోశాధికారి గోవర్థన్‌, హెచ్‌పిసిఎల్‌ గ్యాస్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ సెక్రటరీ వెంకటేశ్వరరావు, ఐఓసిఇఎల్‌ ఆయిల్‌ సిఐటియు ప్రెసిడెంట్‌ కృష్ణ, సెక్రటరీ శేషు , బిపిసిఎల్‌ ఆయిల్‌ యూనియన్‌ సిఐటియు ప్రెసిడెంట్‌ కృష్ణ , సభ్యులు శివకృష్ణ, హెచ్‌పిసిఎల్‌ ఆయిల్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ నాయకులు సుబ్బారావు, రమేష్‌, భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️