అడుగంటిన ప్రాజెక్టులు

ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లాలోని గండికోట, బ్రహ్మంసాగర్‌, మైలవరం, పైడిపాలెం, సర్వరాయసాగర్‌, ఎస్‌ఆర్‌-1, ఎస్‌ఆర్‌-2, అన్న మయ్య, వెలిగల్లు, చిత్రావతి, లోయర్‌ సగిలేరు, దిగువ సగిలేరు, బుగ్గ వంక ప్రాజెక్టుల్లో 82.258 టిఎంసిలు నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వర్షాలు లేకపోవడంతో 17.4044 టిఎంసిలకు చేరుకుని డెడ్‌స్టోరేజీ దిశగా పరుగులు తీస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. పైగా ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులను సక్రమంగా మెయింటె నెన్స్‌ చేయకపోవడంతో ప్రమాదకర సంకేతాలను ఇస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గండికోట ప్రాజెక్టు గండికోట ప్రాజెక్టు 26.850 టిఎంసిల సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం 2.806 టిఎంసిలు మాత్రమే నీరు నిల్వ ఉంది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ నుంచి సుమారు 106 కిలోమీటర్ల మేరకు గాలేరు-నగరి ఫేజ్‌-2 దశలోని పనులు పూర్తి చేయాల్సి ఉంది. వైసిపి సర్కారు హయా ంలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడంతో గతేడాది నుంచి సాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆదుకున్న సంగతి తెలిసిందే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నైరుతి రుతు పవనాలు అనుకూలిస్తే సాగు, తాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంటుంది.. మైలవరం రిజర్వాయర్‌ మైలవరం 9.960 టిఎంసిల సామర్థ్యంతో నిర్మితమైంది. ప్రస్తుతం 0.501 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంటోంది. దీన్ని ఎక్కువగా సాగు నీటి అవసరాల నిమిత్తం ఏర్పాటు చేశారు. దీనికి లోపలి వైపున సప్లరు కెనాల్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం మైలవరం రిజర్వాయర్‌ తాగునీటి అవసరాలను తీర్చడానికి పరిమితమైంది.చిత్రావతి రిజర్వాయర్‌ చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ 10.229 టిఎంసిల సామ ర్థ్యంతో నిర్మితమైంది. ప్రస్తుతం 4.030 టిఎంసిల నిల్వను కలిగి ఉంది. డెడ్‌స్టోరేజీ దిశగా పరుగులు తీస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సరఫరాకు అందించ లేని దుస్థితికి చేరుకుంది.బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ 17.73 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో నిర్మితమైంది. 2.329 టిఎంసిల నీటి నిల్వను కలిగి ఉంది. బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ కింద సుమారు 1.50 లక్షల పైచిలుకు ఆయకట్టు ఉంది. తెలుగు గంగ కాలువలో పూడికతీత పనులను అసంపూర్తిగా చేయడంతో శ్రీశైలం నుంచి విడుదలైన నీరు కాలువల లీకేజీల మయమైంది. దీంతో విడుదల చేసిన సాగునీరు పూర్తి స్థాయిలో రిజర్వాయర్‌ను చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సబ్సిడీ రిజర్వాయర్‌-1 తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన సబ్సిడీ రిజర్వాయర్‌-1, 2. 134 టిఎంసీల సామర్థ్యంతో నీటి నిల్వను కలిగి ఉంది. ప్రస్తుతం 0. 185 టిఎంసిల నిల్వ నీటిని కలిగి ఉంది. దీంతో తాగునీటి అవసరాలకు మాత్రమే పరిమితమవుతోంది.సబ్సిడీ రిజర్వాయర్‌-11 తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన సబ్సిడీ రిజర్వాయర్‌-11 1.447 టిఎంసిల నీటి నిల్వను కలిగి ఉంది. ప్రస్తుతం 0.149 టిఎంసిల నీటి నిల్వలను కలిగి ఉంది. వెలిగల్లు ప్రాజెక్టు వెలిగల్లు ప్రాజెక్టు 4.64 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం 1.154 టిఎంసిల నీటి నిల్వను కలిగి ఉంది. దీని కింద 24 వేల హెక్టార్ల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం వెలిగల్లు ప్రాజెక్టు రాయచోటి పట్టణవా సుల తాగునీటి సమస్యను తీరుస్తోంది. ప్రాజెక్టు నిర్మించిన పదేళ్లలో ఒకసారి కూడా నిండిన అవకాశాలు లేవని తెలుస్తోంది.వామికొండ వామికొండ రిజర్వాయర్‌ 1.658 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో నిర్మి తమైంది. ప్రస్తుతం 0.571 టిఎంసిల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని కింద 20 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు అసంపూర్తి నిర్మా ణంతో సాగు నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేయలేని దుస్థితి దాపురించింది. సర్వరాయసాగర్‌ : సర్వరాయసాగర్‌ రిజర్వాయర్‌ 3.060 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో నిర్మితమైంది. ప్రస్తుతం 0.474 టిఎంసిల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని కింద 25 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించకపోవడంతో అరకొర నీటి నిల్వలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.పైడిపాలెం : పైడిపాలెం రిజర్వాయర్‌ ఆరు టిఎంసిల సామర్థ్యంతో నిర్మితమైంది. ప్రస్తుతం 3.893 టిఎంసిల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 50 శాతం నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండడం స్వల్ప ఊరట కలిగించడం మినహా ఎటువంటి ప్రయోజనమూ లేదు. బుగ్గవంకప్రాజెక్టు : బుగ్గవంక ప్రాజెక్టు 0.506 టిఎంసిల నీటి సామర్య్థాన్ని కలిగి ఉం ది. ప్రస్తుతం 0.051 టిఎంసిల నీటి నిల్వను కలిగి ఉంది. తాగునీటి అవసరాలకు మాత్రమే పరిమితమైనట్లు తెలుస్తోంది.లోయర్‌ సగిలేరు ప్రాజెక్టు : తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా లోయర్‌సగిలేరు ప్రాజె క్టు నిర్మితమైంది. 0.169 టిఎంసిల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మి తమైంది. ప్రస్తుతం ప్రాజెక్టులో చుక్కనీరు లేకపో వడం గమనార్హం. దీని పరిధిలో 13 వేల ఎకరాల ఆయకట్టు సాగయ్యే అవకాశం ఉంది.

➡️