నామినేషన్లకోలాహలం

Apr 24,2024 21:38

ఉమ్మడి జిల్లాలో 61 నామినేషన్లు దాఖలు

విజయనగరంలో ఎంపికి 4, అసెంబ్లీకి 31

పార్వతీపురంలో పార్లమెంటుకు 10, శాసన సభకు 16

ప్రజాశక్తి-విజయనగరం కోట, పార్వతీపురం  : ఉమ్మడి విజయనరగం జిల్లాలో ఆరోరోజు బుధవారం 76 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో విజయనగరం పార్లమెంట్‌ స్థానానికి 5 నామినేషన్లు, 7 అసెంబ్లీ స్థానాలకు 31 నామినేషన్లు పడ్డాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో అరకు పార్లమెంట్‌ స్థానానికి 10 నామినేషన్లు, 4 అసెంబ్లీ స్థానాలకు 16 నామినేషన్లు దాఖలయ్యాయి. విజయనగరం పార్లమెంటు స్థానానికి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలను, రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మికి అందజేశారు. టిడిపి అభ్యర్ధిగా కలిశెట్టి రామలక్ష్మి, కాంగ్రెస్‌ తరపున బొబ్బిలి శ్రీను, నవ భారత నిర్మాణ సేవా పార్టీ అభ్యర్థిగా వంగపండు మహేశ్వరరావు, వైసిపి అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్‌ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు.

జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు 31 నామినేషన్లు దాఖలయ్యాయి. విజయనగరం పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి బొబ్బిలి శ్రీను, టిడిపి నుంచి కలిశెట్టి రామలక్ష్మి, నవ భారత్‌ నిర్మాణ్‌ సేవా పార్టీ నుంచి వంగపండు మహేశ్వరరావు, వైసిపి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ నామినేషన్లు వేశారు. విజయనగరం అసెంబ్లీ స్థానానికి టిడిపి అభ్యర్థులుగా పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు, సునీలా గజపతిరాజు, స్వతంత్రులుగా పాండ్రంకి వెంకటరమణ, పడాల ఆదినారాయణ, షేక్‌ రామ్‌తుల్లా తమ నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి కార్తీక్‌కు అందజేశారు.

గజపతినగరం : నియోజకవర్గంలో ఆరుగురు నామినేషన్లు వేశారు. టిడిపి నుంచి కొండపల్లి శ్రీనివాస్‌, కొండపల్లి లక్ష్మీ సింధు, కాంగ్రెస్‌ నుంచి డోల శ్రీనివాస్‌, జై మహాభారత్‌ పార్టీ నుంచి లెంక సూర్యరారావు, సమాజవాది పార్టీ నుంచి కిలపర్తి కుమార్‌రాజు, స్వతంత్ర అభ్యర్థిగా తలపుల శంకర్రావు నామినేషన్లు వేశారు.

నామినేషన్లకోలాహలం

చీపురుపల్లి : నియోజకవర్గంలో ముగ్గురు నామినేషన్లు వేశారు. టిడిపి నుంచి కిమిడి కళా వెంకటరావు, కిమిడి వెంకట సూర్య రామ మల్లిక్‌, రిఫార్మ్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా అదపాక సూరిబాబు నామినేషన్‌ వేశారు.

శృంగవరపుకోట : నియోజకవర్గంలో నాలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టిడిపి నుంచి కోళ్ల లలితకుమారి, గొంప సత్యవతి, సమాజ్‌వాదీ పార్టీ నుంచి విన్నకోట జగన్నాధరావు, స్వతంత్ర అభ్యర్థిగా చిప్పాడ శేషగిరిరావు నామినేషన్‌ వేశారు.

నెల్లిమర్ల : నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. జైభీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ నుంచి టొంపల నర్సయ్య, అఖిల భారతీయ జన సంఫ్‌ు నుంచి నడిపేన శ్రీను, స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సత్య ప్రసాద్‌బాబు నామినేషన్లు వేశారు.

రాజాం : నియోజకవర్గంలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైసిపి అభ్యర్థి తలే రాజేష్‌, డాక్టర్‌ గాయం మాధవి లత, టిడిపి నుంచి కోండ్రు శ్రీ లక్ష్మి, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థిగా కుప్పిలి చైతన్యకుమార్‌ నామినేషన్లు వేశారు.

బొబ్బిలి : నియోజకవర్గంలో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా మరిపి విద్యాసాగర్‌, టిడిపి నుంచి శిల్పారావు, నవ భారత్‌ నిర్మాణ్‌ సేవా పార్టీ నుంచి తుమరాడ రమణమ్మ, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా కిరణ్‌కుమార్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా రౌతు జయ రామ కృష్ణ నాయుడు, మర్రాపు భానుమూర్తి నామినేషన్లు వేశారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో..

అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా గుమ్మ తనూజ రాణి, చెట్టివినరు, సిపిఎం అభ్యర్థిగా కిల్లో సురేంద్ర, స్వతంత్ర అభ్యర్థులుగా జోరంగి వెంకటరావు, నిమ్మక జయరాజు, బిజెపి అభ్యర్థి కొత్తపల్లి గీత తరఫున రెండు సెట్లు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు అశోక్‌కుమార్‌, సమరెడ్డి బాలకృష్ణ ఒక్కొక్క సెట్‌ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ఇండియన్‌ ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా ఊయక చెంచు ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు.సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా పి.రాజన్నదొర రెండోసారి నామినేషన్‌ వేశారు. ఇదే పార్టీ అభ్యర్థిగా పీడిక సుదర్శనరావు, కాంగ్రెస్‌ అభ్యర్థి మువ్వల పుష్పారావు, టిడిపి అభ్యర్థి సంధ్యారాణి నామినేషన్లు వేశారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా బిడ్డిక శంకరరావు, మండంగి రమణ రెండవ సెట్‌ నామినేషన్‌ వేశారు. టిడిపి అభ్యర్థిగా అడ్డాకుల నరేష్‌, వైసిపి తరపున ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ, కాంగ్రెస్‌ అభ్యర్థిగా సవర చంటిబాబు, స్వతంత్ర అభ్యర్థిగా నిమ్మక పాండురంగ నామినేషన్లు వేశారు. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థిగా అలజంగి జోగారావు, అలజంగి రవికుమార్‌, టిడిపి అభ్యర్థి బోనెల విజయచంద్ర, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థిగా పొట్నూరు కిరణ్‌ కుమార్‌, స్వతంత్ర అభ్యర్థిగా అక్కివరపు మోహన్‌ రావు నామినేషన్లు వేశారు.

➡️