పలువురు అభ్యర్థుల ప్రచారాల హోరు

Apr 22,2024 22:54
  • ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వవిప్‌ ఉదయభాను

ప్రజాశక్తి – జగ్గయ్యపేట : జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఐదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వవిప్‌, శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. మండలంలోని చిల్లకల్లు ఎస్‌సి కాలనీలో ప్రభుత్వవిప్‌, శాసనసభ్యులు సామినేని ఉదయభాను తన ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుండి అందిన సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ గతంలో చేయని అభివృద్ధిని తాను చేసి చూపించానన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరారు.టిడిపి అభ్యర్థి శ్రీరాం ప్రచారంప్రజాశక్తి – జగ్గయ్యపేట : గరికపాడు, తక్కెళ్ళపాడు, రామచంద్రుని పేట గ్రామాలలో సోమవారం జగ్గయ్యపేట నియోజకవర్గ టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రామ్‌ రాజగోపాల్‌, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయా గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలు ద్వారా పేద ప్రజల్లో వెలుగులు రాబోతున్నాయని అన్నారు.ఈ సందర్భంలో తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన ధారావత్‌ శంకర్‌, దారావత్‌ వెంకటేశ్వర్లు, వట్టికూటి వెంకటేశ్వర్లు (దేవుడు) వైసిపి నుండి టిడిపిలో చేరారు. మరికొందరు టిడిపిలో చేరారు. మైలవరం వైసిపి అభ్యర్థి సర్నాల తిరుపతిరావుప్రజాశక్తి – భవానీపురం : జగన్‌ ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రతి గడపకు వివరిస్తూ మైలవరం నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు సోమవారం గొల్లపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. గొల్లపూడి గ్రామంలోని నేతాజీ నగర్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సర్నాల తిరుపతిరావు ప్రజలను కలిసి ఓట్లను అభ్యర్థించారు. సోమవారం సాయంత్రం గొల్లపూడి గ్రామం, నేతాజీ నగర్‌లో మైలవరం నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు.శ్రీరాం తాతయ్య భార్య శ్రీదేవి ప్రచారంప్రజాశక్తి – జగ్గయ్యపేట : టిడిపి, జనసేన, బిజెపిల నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ (తాతయ్య) సతీమణి శ్రీరాం శ్రీదేవి అమ్మజి సోమవారం ప్రచారం నిర్వహించారు. 10, 11వ వార్డులు సీతారామపురం బజార్‌లో టిడిపి, జనసేన బిజెపిల మహిళా నాయకులుతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ మేనిఫెస్టో పథకాలను ప్రజలకు వివరిస్తూ, తాతయ్యను గెలిపించాలని కోరారు.సిపిఐ పశ్చమ అభ్యర్థి కోటేశ్వరరావు ప్రచారంప్రజాశక్తి – వన్‌టౌన్‌ : నగరంలోని ప్రజా సమస్యలను వైసిపి ప్రజాప్రతినిధులు గాలికొదిలేశారని ఇండియా వేదిక బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు అగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం స్థానిక 52వ డివిజన్‌ కొండ ప్రాంతం మాకినవారి వీధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని జి.కోటేశ్వరరావు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కమ్యూనిస్టు పార్టీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ప్రజలకు అందించిన సేవలను, నియోజకవర్గ అభివద్ధికి చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తుచేస్తూ, ఈసారి ఎన్నికలలో తమకే ఓటు వేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతంలో మెట్లు, సైడ్‌ కాలువలు పాడైపోయాయని, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేసినా పైపులకు కనెక్షన్‌ ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

➡️