కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

Jun 19,2024 22:04

ప్రజాశక్తి – గంపలగూడెం : ముఠా, ఆటో ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్‌ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎన్‌.సిహెచ్‌.శ్రీనివాస్‌ కోరారు. బుధవారం మండలంలోని ఊటుకూరు గ్రామంలో పలు ముఠా కార్మిక సంఘ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ, గత పాలకులు ముఠా కార్మికుల హక్కులను కాల రాసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము గడిచిన ఐదేళ్ల ఉద్యమ ఫలితాలే బిజెపి తగ్గుదలగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఠా నాయకులు గద్దల శేషయ్య, రైతు సంఘం నాయకులు ఎన్‌ జె చారి, జిల్లా సిఐటియు కార్యదర్శి వెంకటేశ్వరరావు పలువురు ముఠా నాయకులు పాల్గొన్నారు.

➡️