ఎన్‌టిటిపిఎస్‌ కోల్‌ ప్లాంట్‌లో ప్రమాదం

May 3,2024 21:54

ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : ఎన్‌టిటిపిఎస్‌ కోల్‌ ప్లాంట్‌లో శుక్రవారం ప్రమాదం జరిగింది. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో బొగ్గు వ్యాగన్లు ఢకొీని జూపూడికి చెందిన సునావత్‌ కోటేశ్వరి (34) ఎస్టి మహిళా కార్మికురాలు రెండు కాళ్లు పూర్తిగా విరిగి పోవడంతో వైద్యం కోసం విజయవాడ ఎన్నారై హాస్పిటల్‌కు స్థానికులు తరలించారు. ఈ విషయం బయటకు రాకుండా ఎన్‌టిపిఎస్‌ అధికారులు గోప్యంగా ఉంచారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్లే పలు ప్రమాదాలు సంభవించి వివిధ లోకేషన్లలో కాంట్రాక్టు కార్మికులు బలవుతున్నారని, కొద్దికాలం క్రితం ఇదేవిధంగా ప్రమాదం జరిగి ఇబ్రహీంపట్నానికి చెందిన కాంట్రాక్టు కార్మికుడు మృతిచెందాడు. ఎన్‌టిటిపిఎస్‌ అధికారులు ఇప్పటికీ గుణపాఠం నేర్వకుండా పదే పదే కార్మికులను బలి తీసుకుంటున్నారని కార్మిక సం ఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్‌టి టిపిఎస్‌లో ప్రమాదాలకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని, అధికారులు, కాంట్రా క్టర్లు నిర్లక్ష్యం వలననే ప్రమాదాలు జరుగు తున్నాయని, బాధితురాలికి న్యాయం చేయాలని కుటుంబీకులు డిమాండ్‌ చేస్తున్నారు.

➡️