పెనమలూరులో భగత్ సింగ్ 93వ వర్ధంతి

Mar 23,2024 17:02 #ntr district

ప్రజాశక్తి-పెనమలూరు : సర్దార్ భగత్ సింగ్. సుఖదేవ్, రాజ్ గురుల 93వ వర్ధంతి సందర్భంగా తాడిగడప మున్సిపాలిటీలో యలమలకుదురు భగత్ సింగ్ నగర్ లో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి డివైఎఫ్ఐ యువజన సంఘం తాడిగడప పట్టణ నాయకులు పి క్రాంతి పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే అనేక ప్రాంతాల్లో భగత్ సింగ్ వర్ధంతి సభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెనమలూరు మండలం సిఐటియు యూనియన్ కార్యదర్శి ఉప్పాడ త్రిమూర్తులు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే దేశం కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన గొప్ప నాయకులు భగత్ సింగ్ మనకు ఆయన ఆదర్శంగా ఉన్నారని కానీ ఈ రోజుల్లో మనల్ని పరిపాలించే రాజకీయ నాయకులు కొంతమంది అతి చిన్న పదవి వచ్చినా ఆ పదవిని అడ్డం పెట్టుకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం  దోసుకోవడం దాచుకోవటం తప్పితే ప్రజల కోసం చేసేదేమీ లేదు అన్నారు. అలాగే మన ముందుకి మళ్లీ ఎలక్షన్ వచ్చాయని మనము ఆలోచించి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేవారిని మన కోసం పనిచేసే వ్యక్తిని నిజాయితీపరుడ్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. కొంతమంది రాజకీయ నాయకులు నీతులు చెప్తారే తప్పితే ఇలాంటి భగత్ సింగ్ లు మా ఇళ్లల్లో పుట్టాలని కోరుకోరు. ఎందుకంటే వాళ్లు దేశం కోసం ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తారు కాబట్టి వారసులుగా నిలవరు కాబట్టి మా పక్కవారి ఇళ్లల్లో పుట్టాలని కోరుకుంటారు. కానీ కమ్యూనిస్టు పార్టీ వాళ్లు మాత్రమే ఇలాంటి మహనీయులు మా ఇళ్లలో పుట్టాలి. ప్రజల కోసం దేశం కోసం ప్రాణాలర్పిత్తానికైనా వెనకాడకూడదని కోరుకుంటారు. అలాగే గతంలో ప్రజా సమస్యలపైన అనేక పోరాటాల్లో అనేక మంది ప్రాణాలర్పించిన ఘన చరిత్ర ఒక కమ్యూనిస్టు పార్టీకే ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ పతి. నాగేశ్వరరావు, మౌలాలి బాజీ, ఎస్కే కాసిం, ఎస్కే సిద్దయ్య, ఎస్కే మస్తాన్, దానయ్య, శ్రీరాములు, తులసీరామ్, అశోక్ కుమార్, అబ్దుల్ ఇలియాస్, అమీషా అబ్దుల్, వీరితోపాటు అనేక మంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

➡️