ఆర్థిక సహాయం అందించిన బొమ్మిన కోటేశ్వరరావు  

Feb 17,2024 12:51 #ntr district
Bommina Koteswara Rao who provided financial assistance

ప్రజాశక్తి-రెడ్డిగూడెం : ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం గ్రామానికి చెందిన నిరుపేదయైన రిక్షా కార్మికుడు గద్దల రాంబాబు గుండె పోటుతో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ విషయం “ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ” స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా తెలుసుకున్న టిడిపి యువ నాయకుడు బొమ్మిన కోటేశ్వరరావు స్పందించి మానవతా దృక్పథంతో 5000/-రూ. ఆర్థిక సహాయం చేశారు. ఈ నగదును రాంబాబు భార్య థామస్ కు టిడిపి నాయకులు చాట్ల అచ్చియ్య, మాతంగి రామారావు, బండపల్లి శిఖామణి అందజేశారు.

➡️